పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసినా ఆమె దశ తిరగలేదు. దాంతో కొన్నాళ్ళు ఆమె సినిమాలకు దూరమయిపోయింది. నిజానికి, ఆమె సినిమాలకు దూరమవడానికి చాలా కారణాలే వున్నాయట. అందులో రెమ్యునరేషన్ సహా అనేక కారణాలున్నాయంటున్నారు. ‘చిన్న హీరోలతో చిన్న సినిమాల్లో చేయను..’ అంటూ ఆమె కొన్ని సినిమాల్ని తిరస్కరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు మాత్రం అనూ ఇమ్మాన్యుయేల్ మళ్ళీ తన కెరీర్‌ని జీరో నుంచి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది.
తమిళంలో ఓ సినిమా చేస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్‌కి తెలుగులో రెండు ఛాన్సులు వచ్చాయట. అందులో ఒకటి నిఖిల్ హీరోగా రూపొందుతోన్న ‘18 పేజెస్’ అని తెలుస్తోంది. ఇది కాక మరో యంగ్ హీరో నటిస్తోన్న చిన్న సినిమాలోనూ అనూ ఇమ్మాన్యుయేల్ నటించనుందంటూ ప్రచారం జరుగుతోంది. తప్పదు, కెరీర్‌లో డౌన్‌ఫాల్ వచ్చినప్పుడు ‘అహంకారం’ అస్సలేమాత్రం పనికిరాదు. కుటుంబ సమస్యల పేరు చెప్పి వెండితెరకు దూరమైపోవడం తాను చేసిన పెద్ద తప్పు అని తెలుసుకున్న ఈ బ్యూటీ, అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లలో మళ్ళీ స్టార్‌డవ్‌ు తెచ్చుకుంటానని చెబుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోయిన అనూ ఇమ్మాన్యుయేల్, లాక్‌డౌన్ తర్వాత.. తన సినిమాల వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తానని అంటోంది.