బేసిగ్గా సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ల సమాహారం. ఇరవై నాలుగు విభాగాలు కలిస్తే ఓ సినిమా అవుతుంది. ఐతే ఇప్పుడీ సీన్ లోకి కొత్త డిపార్ట్మెంట్ చేరనుంది. అదే శానిటరీ విభాగం. అవును ఈ మేరకు మాటలు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విభాగం హీరోల వైపు నుండే తెరపైకి వచ్చింది. కరోనా మహమ్మారి మనిషి నుండి మనిషి అంటుకుంటుంది. కొంచెం అపరిశుభ్రంగా వున్న యమా డేంజర్.
లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ అటు ఇటుగా మొదలౌతాయి. ఐతే కొంతమంది బడా స్టార్స్ షూటింగ్స్ లో కొత్త సీన్ కనబడనుంది. థర్మల్ స్క్రీన్, టెంపరేచర్ టెస్ట్, క్లోరిన్ ఫాగింగ్, అడుగడుగునా శానిటైజర్ బాటిల్, మాస్కులు,, హీరో నుండి లైట్ బాయ్ వరకూ ఈ ఏర్పాట్లు లేనిదే షూటింగ్ లొకేషన్ లో అడుగుపెట్టకూడదని బడా స్టార్, మీడియం హిరోలు అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు టాక్. రెమ్యునిరేషన్ లో కాస్త తగ్గినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ శానిటైజేషన్ లేనిదే యాక్షన్ కి దిగకూడదని భావిస్తున్నారట. హీరోల నిర్ణయం బాగానే వుంది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చినంత వరకూ ఈ జాగ్రత్తలు తప్పవు.