కెరీర్ మొదట్లో చిన్న సినిమాలు చేసినా, ఆ తర్వాత అనూహ్యంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. కానీ, వరుస ఫెయిల్యూర్స్‌తో మొత్తంగా సినిమా అవకాశాలే కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చిందామెకి. వ్యక్తిగత సమస్యల కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం చేతిలో ఓ తెలుగు సినిమా వుందిగానీ, అందులో ఆమె పాత్ర ఏంటి.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఇదిలా వుంటే, తమిళంలో మాత్రం ఈ బ్యూటీ రెండు సినిమాలు చేస్తోంది. తాజా ఖబర్ ఏంటంటే, అనూ ఇమ్మాన్యుయేల్ ఈ మధ్యనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిందట. అదీ తెలుగులో. ఓ యంగ్ హీరో సరసన అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించనుంది. ఆ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ‘కారోనా లాక్‌డౌన్ నేపత్యంలో నేనూ హోవ్‌ు క్వారంటైన్‌లోనే వున్నాను.. త్వరలోనే నేను చేయబోయే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు చెబుతాను..’ అంటోంది అనూ ఇమ్మాన్యుయేల్. ‘ఈసారి తన రియల్ టాలెంట్ ఏంటో మీరంతా చూస్తారు.. నా వైపు నుంచి జరిగిన కొన్ని తప్పులతోనే నేను నటనకు కొద్ది రోజులు దూరమయ్యాను. ఈ సమయంలో చాలా నేర్చుకున్నాను.. నా మైనస్‌లేంటో తెలుసుకున్నాను.. వాటిని నా తదుపరి సినిమాల్లో అధిగమిస్తాను..’ అని అనూ ఇమ్మాన్యుయేల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.