ఆ బ్యూటీకిది వెయిటింగ్‌ టైం

By iQlikMovies - April 26, 2018 - 12:46 PM IST

మరిన్ని వార్తలు

'మజ్ను' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌కి స్టార్టింగ్‌ బాగానే వర్కవుట్‌ అయ్యింది. తర్వాత వచ్చిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' తదితర సినిమాలతో ఓకే అనిపించుకున్న ఈ బ్యూటీకి అసలు సిసలు పాపులారిటీ వచ్చింది మాత్రం 'అజ్ఞాతవాసి'లో ఈ బ్యూటీ పేరు సెలెక్ట్‌ కావడంతోనే. అయితే ఆ సినిమాతో పెరిగిన హైప్‌ అదే సినిమాతో డౌన్‌ ఫాల్‌ అయిపోయింది పాపం అనూ ఇమ్మాన్యుయేల్‌కి.

 

ఆ టైంలోనే వచ్చిన ఆఫర్‌ బన్నీతో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. స్టార్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌, అనూకి హ్యాండిచ్చాడు. మరి బన్నీ హ్యాండ్‌ అందిస్తాడా? లేదా అనే సందిగ్ధంలో అనూ ఉందిప్పుడు. ఓ వైపు సినిమాపై అంచనాలు చూస్తే భారీ స్థాయిలో ఉన్నాయి. మరో వైపు కొన్ని మైనస్‌ సైన్స్‌ ఉన్నప్పటికీ, మారిన ఈక్వేషన్స్‌ పరంగా ఈ సినిమాపై ఆశలు పెరుగుతున్నాయి అనూ ఇమ్మాన్యుయేల్‌కి.

 

ఏది ఏమైనా ఈ సినిమా ఈ బ్యూటీకి అగ్ని పరీక్షలాంటిదే అని చెప్పాలి. ఈ సినిమాతో కానీ హిట్‌ కొట్టిందా.. అనూ రేంజ్‌ మళ్లీ మారిపోనుందంతే. మరోపక్క అవకాశాల పరంగా అనూ ఇమ్మాన్యుయేల్‌కి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ లేదు. ఈ సినిమా కాక, ఆమె చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' అనే చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్‌ రాజా రవితేజతో మరో సినిమాలోనూ అనూ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS