'నా పేరు సూర్య' సినిమా లో బన్నీ ఇరగదీశాడట !

By iQlikMovies - April 26, 2018 - 12:38 PM IST

మరిన్ని వార్తలు

ప్రతీ సినిమాకీ డాన్సుల విషయంలో ఏదో కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తాడు. ఈ సినిమాకీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట డాన్సుల్లో బన్నీ. లేటెస్టుగా వచ్చిన 'ఇరగ ఇరగ..' సాంగ్‌ ప్రోమోలో బన్నీ స్పీడ్‌ డాన్సులు అదరగొట్టేశాడు. జస్ట్‌ ప్రోమో సాంగ్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక ఫుల్‌ సాంగ్‌ ఏ రేంజ్‌లో ఉండనుందో.

 

ఖచ్చితంగా ఫ్యాన్స్‌ మెచ్చే మ్యాజిక్‌ ఏదో ఈ సాంగ్‌లో బన్నీ చేశాడని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఆ మాటకొస్తే, డాన్సులే కాదు, ఫైట్లు కూడా చాలా కొత్తగా ఉండనున్నాయట. ఇంతవరకూ ఏ సినిమాలోనూ చూడని యాక్షన్‌ ఘట్టాలు ఈ సినిమాలో చూడబోతున్నామని చిత్ర యూనిట్‌ అంటోంది. వార్‌ సన్నివేశాలు చాలా ఉత్కంఠగా తెరకెక్కించారట. బన్నీ టాప్‌ మోస్ట్‌ పర్‌ఫామెన్స్‌ని ఈ సినిమాలో చూడబోతున్నామట. ఇప్పటికే బన్నీ గెటప్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అయిపోయింది.

 

డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో, ఓ కనుబొమ్మపై ఘాటుతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బన్నీ ఇదే గెటప్‌లో పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తున్నాడు. ఆ రకంగానూ ఈ సినిమాకి పబ్లిసిటీ వస్తోంది. లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా మారి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాని తెరకెక్కించాడు. దేశభక్తితో పాటు, ఓ మంచి మెసేజ్‌ని ప్రేక్షకులకు అందించే లక్ష్యంతో ఈ సినిమాని తెరకెక్కించాడు వక్కంతం వంశీ. మే 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS