బుమ్రా గురించి మ‌న‌సు విప్పిన అనుప‌మ!

మరిన్ని వార్తలు

సినీ తార‌ల‌తో క్రికెట‌ర్లు ప్రేమాయ‌ణం న‌డ‌ప‌డం కొత్త విష‌యం ఏమీ కాదు. ఈ విష‌యంలో ఈ త‌రానికి ఆద‌ర్శంగా నిలిచాడు కోహ్లీ. అనుష్క శ‌ర్మ‌ని ప్రేమించి పెళ్లాడి - సినీ, క్రికెట‌ర్ బంధానికి కొత్త దారులు చూపించాడు. భార‌త ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రా కూడా ఇదే దారిలో ప‌య‌నిప‌స్తున్నాడ‌ని, ఓ క‌థానాయిక‌ని త‌ను లవ్వాడుతున్నాడ‌ని మీడియా కోడై కూస్తోంది. ఈ ప్రేమ వ్య‌వ‌హారంలో రాశీఖ‌న్నా పేరు ప్ర‌ముఖంగా వినిపించింది.

 

అయితే ఈ విష‌య‌మై రాశీ స్పందించి తానెప్పుడూ బుమ్రాని క‌ల‌వ‌లేద‌ని, అస‌లు బుమ్రా ఎవ‌రో తెలీయ‌ద‌ని క్లారిటీ ఇచ్చింది. ఆ త‌ర‌వాత అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అనుప‌మ - బుమ్రా ల‌వ్వాట‌లో ఉన్నార‌ని, ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని వార్త‌లు వినిపించాయి. వీటిపై ఇప్పుడు అనుప‌మ కూడా స్పందించింది. ``బుమ్రా నాకు మంచి స్నేహితుడు.

 

అంతే త‌ప్ప జ‌రుగుతున్న ప్ర‌చారంలో మాత్రం ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. సో.. బుమ్రా యార్క‌ర్‌కి బౌల్డ్ అయ్యింది అనుప‌మ కూడా కాద‌న్న‌మాట‌. మ‌రి.. ఆ క‌థానాయిక ఎవ‌రో మ‌రి?? రేపు ఎవ‌రి పేరు బ‌య‌ట‌కు వ‌స్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS