గ్లామ్‌షాట్‌: మిస మిసల మిల్కీ గ్లామర్‌ ?

మరిన్ని వార్తలు

ఫిట్‌నెస్‌ కా బాప్‌ మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా బ్యూటీ సీక్రెట్‌ చెప్పామంటే, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండడమే నా బ్యూటీ సీక్రెట్‌ అంటూ సింపుల్‌గా మాట దాటించేస్తుంటుంది. నిజమేనేమో తమన్నా బ్యూటీ సీరకెట్‌ అదేనేమో కూడా. తమన్నా బరువు పెరిగిందట.. అనే టాక్‌ అంతగా వినిపించలేదింతవరకూ.

tamannaah hot

ఏదో ఒకటీ అరా సినిమాల్లో తమన్నా కాస్త బొద్దుగా కనిపించిందేమో కానీ, దాన్ని పెరిగిన బరువు లెక్కల్లో వేయలేం. ఇప్పుడయితే, మరీ జీరో సైజ్‌లో అలరిస్తోంది. అయినా సీనియర్‌ హీరోస్‌ పక్కన కూడా ఈజీగా మ్యాచ్‌ అయిపోతోంది.

tamannaah hot

ఇటీవలే వెంకీతో తమన్నాకి 'ఎఫ్‌ 2'తో కొట్టిన హిట్‌ మరింత ఉత్సాహాన్ని అందించింది. సక్సెస్‌ వచ్చాక ఫేస్‌లో కనిపించే ఆ కిక్కే వేరు కదా. కొత్త పెళ్లికూతురుకి ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లుంది ఆ కిక్కు.

tamannaah hot

అదే కిక్కు ఇప్పుడు తమన్నాలోనూ కనిపిస్తోంది. తాజాగా 'రాజుగారి గది' మూడో సిరీస్‌ నుండి తమన్నా అవుట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే హిందీలో ఓ సినిమాకి సైన్‌ చేసిన తమన్నాకి, తమిళ, తెలుగులో కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

tamannaah hot

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు 'సైరా', 'దటీజ్‌ మహాలక్ష్మి' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే, సినిమాల లిస్టు పక్కన పెడితే, తాజాగా ఎఫ్‌హెచ్‌ఎమ్‌ మ్యాగ్జైన్‌ కోసం తమన్నా లేటెస్ట్‌గా ఇచ్చిన హాట్‌ పోజులు కుర్రకారుకు అన్నింటికీ మించిన కొత్త కిక్‌ ఇస్తున్నాయి. అవంతికా రాకుమారి గ్లామర్‌ స్టామినా అంటే ఇదీ. ఆ.! అంటూ ఈ పిక్స్‌ చూసి కుర్రోళ్లు పండగ చేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS