యాక్షన్‌కీ, ఓవరాక్షన్‌కీ చిన్న గీత ఉంటుంది. అది కెమెరా ముందు నిలబడిన నటీనటులకు తెలిసుండాలి. కొన్ని సార్లు పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలన్న ఉద్దేశంతో ఈ గీత తెలియకుండానే దాటేస్తుంటారు. అయితే.. కెమెరా ముందు కంట్రోల్ తప్పకూడదు అన్న ఆలోచన.. మదిలో మెదులుతూ ఉంటే, నటనపై దృష్టి పెట్టలేరు. ఈ గండాన్ని ఎలా దాటేస్తారు? అని అనుపమ పరమేశ్వరన్ ని అడిగితే.. ఆ సీక్రెట్ చెప్పేసింది.
``నటన నటనే. సినిమా సినిమానే. జీవితానికీ - సినిమాకీ చాలా దూరం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు. పాత్రలా ప్రవర్తించడానికీ, ఆ పాత్రలా మారిపోవడానికీ చాలా తేడా ఉంటుంది. ఆ తేడా గమనిస్తే చాలు. దర్శకుడు `షాట్ ఓకే` అన్నా సరే. నేను మానేటర్‌లో ఓసారి చూసుకుంటా. కంట్రోల్ తప్పానా, లేదా? అనేది నాకే అర్థమైపోతుంది`` అంది.