ఆమె నవ్వులో ఏదో మత్తు దాగి ఉంటుంది. మలయాళ ముద్దుగుమ్మ అయినా అచ్చం తెలుగమ్మాయిలాగానే అన్పిస్తుంది. హీరోయిన్గా తొలి సినిమా 'అఆ' నుంచి ఇటీవల వచ్చిన 'శతమానంభవతి' వరకు ఏ సినిమాలో చేసినా, మన తెలుగమ్మాయేనని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆమె మాటలోనూ అదో టైపు మత్తు కనిపిస్తుంటుంది. అదే అనుపమ స్పెషల్. నటనతోనూ, తన గ్లామర్‌తోనూ తెలుగు ప్రేక్షుల గుండెల్లో చోటు దక్కించుక్ను ఈ బ్యూటీ గ్లామర్ ఓకే, ఎక్స్పోజింగ్ పేరుతో వల్గారిటీకి మాత్రం నాట్ ఓకే అంటుంది. ఎక్స్పోజింగ్ చేస్తేనే గ్లామరా? ఈ బ్యూటీ నవ్వులోని గ్లామర్ ముందే ఏ అందాల ప్రదర్శన పోటీ పడగలదు?