అనుపమకి స్టార్‌డమ్‌ వచ్చేసినట్లే!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రామ్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసినదే కదా. కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరో హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తోంది. 'అఆ', 'శతమానం భవతి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనుపమ, రామ్‌ సినిమాతో తనకు స్టార్‌డమ్‌ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. అనుపమ ఈ సినిమాతో కొంచెం గ్లామరస్‌గా కూడా కనిపించనుందని సమాచారమ్‌. 'శతమానం భవతి' సినిమాలో మోడ్రన్‌ దుస్తుల్లో కనిపించినా, మరీ అల్ట్రా మోడ్రన్‌ స్థాయికి ఆమె గ్లామర్‌ ఏమి చూపించలేదు. నటన పరంగా ఆమెకు వంకలు పెట్టడానికేమీ లేకపోయినా, ఇంతవరకు ఆమె గ్లామరస్‌గా కనిపించకపోవడంతో ఆమెను ఆ యాంగిల్‌లో చూపించాలని దర్శకుడు కిషోర్‌ తిరుమల అనుకుంటున్నాడట. ఇంకో వైపున ఈ సినిమా కోసం హీరో రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేస్తున్నాడనే టాక్‌ వినవస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉంటూనే, రామ్‌ అభిమానులు మెచ్చే డాన్సులు, ఫైట్స్‌ సహా మాస్‌ అంశాలు సినిమా నిండా పుష్కలంగా ఉంటాయట. ఎనర్జీకి మారుపేరు రామ్‌. ఆయన ఎనర్జీకి తగ్గ ఎంటర్‌టైనింగ్‌ సబ్జెక్ట్‌ని కిషోర్‌ తిరుమల ఎంచుకున్నాడని తెలియవస్తోంది. ఏదేమైనా ఈ సినిమాపై అందరికన్నా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది అందాల భామ అనుపమ. ఆమె స్టార్‌డమ్‌ ఈ సినిమాతో ఎంతలా పెరుగుతుందో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS