అనుపమ పరమేశ్వరన్... టాలీవుడ్లోని టాలెంటెడ్ కథానాయికల్లో ఒకరు. అందం కంటే, అభినయాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తోంది. అవకాశాలూ అలానే వస్తున్నాయి. ఎందుకో ఈమధ్య బాగా వెనుకబడింది. `రౌడీ బోయ్స్`లో ఓ కుర్ర హీరో పక్కన నటించింది. అది కూడా పారితోషికం కోసం. తన రేంజ్ కంటే, ఎక్కువ పారితోషికం ఇస్తానని చెప్పగానే, ఈ సినిమా చేయడానికి ఒప్పేసుకుంది అనుపమ. అంతేకాదు.. ఇది వరకెప్పుడూ లేనంతగా బోల్డ్ గా కనిపించింది. లిప్ లాక్ కిస్సులూ ఇచ్చింది. ఇప్పటి వరకూ అనుపమని ఇలా చూడలేదు కదా.. ఇలాంటి సీన్లు ఎందుకు చేసింది? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సీన్లు చేయడానికి కూడా ఎగస్ట్రా పారితోషికం డిమాండ్ చేసిందట.
నిర్మాత దిల్ రాజు కూడా అడిగిందంతా ఇచ్చాడట. తీరా చూస్తే.. రౌడీ బోయ్స్ ఫ్లాప్ అయ్యింది. అనుపమ క్యారెక్టర్ కూడా అంతగా రిజిస్టర్ కాలేదు. దానికి తోడు బాగా బక్కచిక్కి.. గ్లామర్ తగ్గినట్టు కనిపిస్తోంది. ఇలాగైతే పెద్ద హీరోల సినిమాల్లో అనుపమకు ఛాన్సులు రావడం చాలా కష్టం. తన కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందనుకోవాలి. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసి, అందులో ఒకట్రెండు హిట్లు కొడితే.. అనుపమకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే.. కాస్త గ్లామర్‌పై దృష్టి పెట్టి, ఇది వరకటిలా మంచి పాత్రల్ని, మంచి సినిమాల్ని ఎంచుకోవాలి. మరి.. అనుపమకు ఇండ్రస్ట్రీ అంత టైమ్ ఇస్తుందా? వెయిట్ అండ్ సీ.