ఆచార్య చిరంజీవి సినిమా. ఆర్.ఆర్.ఆర్. ఏమో... రాజమౌళి సినిమా. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు వేరు. దర్శకులు వేరు. కాకపోతే... ఒక డీల్ ఉంది. అదేంటంటే.. `ఆర్.ఆర్.ఆర్` విడుదలైన తరవాతే.. `ఆచార్య` విడుదల చేసుకోవాలని. ఎందుకంటే.. ఆర్.ఆర్.ఆర్‌లోనూ, ఆచార్యలోనూ.. రామ్ చరణ్ ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ జరుగుతుండగా, `ఆచార్య` కోసం రామ్ చరణ్ కాల్షీట్లు కావల్సివచ్చాయి. అందుకోసం రాజమౌళిని సంప్రదిస్తే.. `ఆర్.ఆర్.ఆర్ కంటే ఆచార్య ముందు రిలీజ్ అయితే, ఆర్.ఆర్.ఆర్‌లోని చరణ్ గెటప్ రివీల్ అయిపోతుంది. నాకు ఇష్టం లేదు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యాకే ఆచార్యని రిలీజ్ చేసుకుంటామంటే నాకు అభ్యంతరం లేదు` అన్నారట. అందుకే ఆర్.ఆర్.ఆర్ వచ్చాకే ఆచార్యని రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు.
అయితే కరోనా కారణంగా ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడింది. ఫిబ్రవరి 4న రావాల్సిన ఆచార్య కూడా రావడం లేదు. అయితే ఏప్రిల్ 1న ఆచార్యని విడుదల చేస్తున్నారు. అంతకంటే ముందు ఆర్.ఆర్.ఆర్ రావాలి. కానీ.. అలా జరగడం లేదు. ఇప్పుడు ఆచార్య విడుదలయ్యాకే ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. ఏప్రిల్ 1న ఆచార్యని విడుదల చేస్తుంటే, ఏప్రిల్ 29న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆర్.ఆర్.ఆర్ కంటే ముందు ఆచార్యని విడుదల చేయడానికి రాజమౌళి కూడా ఒప్పుకున్నాడని, అందుకే ఏప్రిల్ 1న ఆచార్య రిలీజ్‌డేట్ ప్రకటించేశారని టాక్. అలా.. ఈ రెండు సినిమాల మధ్య ఒప్పందం కుదిరిందన్నమాట.