అనుపమ పరమేశ్వరన్‌పై ఓ విమర్శ ఉంది. ఈమధ్య ప్రమోషన్లకు సరిగా రావడం లేదని ఆమెపై కంప్లైంట్లు ఉన్నాయి. ఇటీవల ఆమె చేసిన `రౌడీ బోయ్స్`, `కార్తికేయ 2` ప్రమోషన్లలో పెద్దగా కనిపించలేదు అను. ఈ విషయంపై నిఖిల్ కూడా పరోక్షంగా అనుపమపై సెటైర్లు వేశాడు. తన అసహనాన్ని బాహాటంగానే ప్రకటించాడు. ఇప్పుడు అనుపమ నటించిన `18 పేజెస్` సినిమా విడుదలకు రెడీగానే ఉంది. ఇందులోనూ నిఖిలే హీరో. ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే అనుపమ ఎక్కడా కనిపించడం లేదు. ఈసారీ ఆమె డుమ్మా కొడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాకపోతే.. ఇది అల్లు అరవింద్ సినిమా. ఆయన తలచుకొంటే.. ఎవరినైనా సరే, ప్రమోషన్లకు దింపేస్తారు. అనుపమని రప్పించడం పెద్ద మేటరేం కాదు. త్వరలోనే 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ ఈవెంట్ లో అనుపమ కనిపిస్తే.. ప్రమోషన్లకు టచ్‌లో ఉన్నట్టే. లేదంటే ఈ సారీ ఆమె హ్యాండ్ ఇచ్చిందనే అనుకోవాలి. కొంతమంది హీరోయిన్లు అంతే. సినిమా అయ్యేంత వరకే నా బాధ్యత.. ఆ తరవాత నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. అనుపమనీ ఆ జాబితాలో చేర్చేయాలేమో..?