నాగార్జున ఈమధ్య వెండి తెరపై పోలిస్తే... బుల్లి తెరపైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. దానికి కారణం.. బిగ్ బాస్ షోనే. గత నాలుగు సీజన్లలోనూ నాగ్‌నే హోస్ట్. ప్రస్తుతం బిగ్ బాస్ 6 సీజన్ నడుస్తోంది. అయితే ఇక మీదట నాగార్జున బిగ్ బాస్ లో కనిపించడనే వార్త బయట షికారు చేస్తోంది. గత సీజన్లతో పోలిస్తే... బిగ్ బాస్‌కి ఆదరణ తగ్గడం, రేటింగులు పడిపోవడం.. కలవరపెడుతున్నాయి. పైగా పేరున్న సెలబ్రెటీలు ఎవరూ బిగ్ బాస్ లోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా నాగ్ ని చిరాకు తెప్పిస్తోందని టాక్. ఇది వరకు ఎలిమినేషన్లలో నాగ్ అభిప్రాయానికి విలువ ఉండేది. ఎవరి ఎలిమినేషన్ అయినా.. నాగ్ సూచనల మేరకు చేసేవారు. ఇప్పుడు మాత్రం... నాగ్ అభిప్రాయాల్ని బిగ్ బాస్ టీమ్ పరిశీలించడం లేదని టాక్. కొన్ని ఎలిమినేషన్ల పట్ల నాగ్ నిరుత్సాహానికి గురయ్యాడని టాక్. పైగా... పబ్లిసిటీ విషయంలోనూ బిగ్ బాస్ టీమ్... చాలా ఉదాశీనంగా వ్యవహరిస్తోందని నాగ్ ఫీలవుతున్నాడట. తను ప్రస్తుతం వందో సినిమాకి దగ్గర పడుతున్నాడు. వందో సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలని ప్లాన్. అందుకే బిగ్ బాస్‌కి దూరం కావాలని అనుకొంటున్నాడని టాక్. ఒకవేళ నాగార్జున ఈ షోని వదులుకొంటే.. మరో సెలబ్రెటీని పట్టుకోవడం బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కష్టం అవుతుంది.