‘అ,ఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ సెలెక్టివ్‌గా సినిమలు చేసుకుంటూ వస్తోంది. ఆమె తెలుగులో చివరిగా చేసిన ‘రాక్షసుడు’ మూవీ సక్సెస్ లిస్టులోనే ఉన్నప్పటికీ, అది ఆమె కెరీర్‌కి పెద్దగా యూజ్ అయినట్లు లేదు. టాలీవుడ్‌లో ప్రస్తుతం అనుపమ ఖాతాలో కొత్త ప్రాజెక్టులేమీ లేవు కానీ, ‘కార్తికేయ 2’ కోసం అనుపమ పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో అనుపమ గ్లామరస్ ఫోటోలు కొన్ని హల్‌చల్ చేశాయి. అయితే, గ్లామర్‌కి పూర్తిగా దూరంగా ఉండే అనుపమ ఆ ఫోటోలు తనవి కావంటూ, గుస్సా అవుతోంది. అలా తన ఫోటోస్‌ని మార్ఫింగ్ చేసిన నెటిజన్స్‌పై దుమ్మెత్తిపోస్తోంది.
పనీ పాటా లేని వాళ్లు ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు .. అంటూ వారి దుమ్ము దులిపేస్తోంది. అంతేకాదు, మార్ఫింగ్ చేసిన ఫోటోలకు ఒరిజినల్ ఫోటోస్‌ని ట్యాగ్ చేసి మరీ, నెట్టింట్లో వారి తాట తీసేస్తోంది. క్యూట్‌గా, స్వీట్‌గా కనిపించే అనుపమలో ఇంత ఫైర్ దాగుందా.. అనిపించేంతలా ఆమెలోని ఫైరింగ్ టాలెంట్ బయటకొచ్చేసింది ఈ సిట్యువేషన్‌లో. అయితే, ఈ మార్ఫింగ్ ఫోటోస్‌లోనూ ఏమంత గ్లామర్ కనిపించడం లేదు, ఆ మాత్రానికే ఇంతలా ఓవర్ రియాక్ట్ కావాలా .. అంటూ కొందరు నెటిజన్లు రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు అనుపమకి.