టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా ఆదరణ పొందుతున్న బన్నీకి అనూహ్యంగా కేరళలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చాలా తెలుగు సినిమాలు కేరళలో విడుదలవుతుంటాయి. మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి. అక్కడ అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిుచుకుంటారు. అందుకే లాక్‌డౌన్ కారణంగా బాధపడుతున్న కేరళలోని తన అభిమానుల కోసం బన్నీ 25 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున, కేరళకు 25 లక్షలు విరాళమిచ్చాడు బన్నీ. ఈ నేపథ్యంలో తాజాగా కేరళ సీఎం పినరాయి విజయన్ బన్నీని ప్రశంసించారు.
ఇలాంటి విపత్కర సమయంలో తన సొంత రాష్ట్రాలతో పాటు, కేరళ ప్రజలకు కూడా సాయమందించాలన్న బన్నీ ఆలోచన ప్రశంసించదగ్గదని ఆయన కొనియాడారు. ఈ సాయానికి కేరళ ప్రజలు రుణపడి ఉంటారని ఆయన తెలిపారు. ఇకపోతే, గతంలో ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోపీ బోట్ రేస్ కార్యక్రమానికి బన్నీని ఆ రాష్ట్ర సీఎం ఛీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే. అలా కేరళ ప్రజల అభిమానంతో పాటు, సీఎం ప్రశంసలు కూడా అందుకున్నాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ, సుకుమార్‌తో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.