బాలీవుడ్ తీరుని ఎండగట్టిన అనురాగ్ కశ్యప్

మరిన్ని వార్తలు

అనురాగ్ కశ్యప్ ఈ పేరు తెలియని వారు ఉండరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో బాలీవుడ్ లో సినిమాలు తీసి, స్టార్ డైరక్టర్ గా గుర్తింపు పొందాడు. సౌత్ లో నటుడిగా కొన్ని సినిమాల్లో నటించి ఇక్కడా మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా కెరీయర్ మొదలుపెట్టిన అనురాగ్ కశ్యప్ ఖాతాలో బాలీవుడ్ లో సూపర్ హిట్స్ ఉన్నాయి. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ప్రయాణం చేస్తున్న అనురాగ్ రీసెంట్ గా నిర్భయంగా బాలీవుడ్ తీరుని ఎండగట్టి, సౌత్ సినిమాని ప్రశంసల్లో ముంచెత్తాడు. అంతే కాదు ఇక బాలీవుడ్ ని వదిలేసి, సౌత్ కి పోతా అంటూ సంచలన కామెంట్స్ చేసాడు అనురాగ్.

బాలీవుడ్ వారి అహాన్ని, కుళ్ళుని ఎప్పటినుంచో భరిస్తున్నట్టు ఉంది అనురాగ్ మాటలు వింటే. పైగా ఇలా మాట్లాడటానికి ఎంతో దైర్యం కావాలి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ 'నేను ఇప్పుడు ప్రయోగాలు చేయలేను. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాతలు ప్రాఫిట్స్ కోసమే చూస్తున్నారు. ఫిలిం మేకింగ్ లో ఉన్న ఆనందాన్ని వారు పట్టించుకోవటం లేదు. అందుకే నెక్స్ట్ ఇయర్ ముంబై నుంచి సౌత్ కి వెళ్ళిపోతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. కారణం కూడా చెప్పాడు సౌత్ వర్క్ ఇన్ స్పైరింగ్ ఉంటుందని, అందుకే అక్కడికి వెళ్ళిపోతా లేదా ఇలాగే ముసలివాడినై చచ్చిపోతాను అని స్పష్టం చేసాడు.

బాలీవుడ్ లో వర్క్ చేయటం ఇక నావల్ల కాదు. ఇక్కడ చాలా నిరుత్సాహంగా ఉంది, 'మంజుమల్' బాయ్స్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని బాలీవుడ్ లో చూడరు. కానీ రీమేక్ చేయాలనీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బాలీవుడ్ లో ప్రస్తుతం కొత్తగా ఏం చేయటానికి ప్రయత్నించకుండా ఉన్నవాటినే తెరెకెక్కిస్తున్నారు. రిస్క్ తీసుకోవట్లేదు, అసలు క్రియేటీవ్ వర్క్ లేదు అని విమర్శలు గుప్పించారు అనురాగ్. కొందరు యాక్టర్స్ నటించటం పై ఇంట్రెస్ట్ చూపించటం లేదు స్టార్స్ అయిపోదామని తాపత్రయ పడుతున్నారు అని నిజాయితీగా బాలీవుడ్ తీరుని ఎండగట్టాడు అనురాగ్.

కల్కి, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తే బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా స్పందించక పోవటం చూసాం. బాలీవుడ్ లో కూడా కొందరు అసంతృప్తులు ఉన్నారని, సౌత్ లో ఉన్న క్రియేటివిటీ ని గుర్తించి సౌత్ మేకింగ్ అండ్ యాక్టింగ్ కి ఫిదా అవుతున్న వారు ఉన్నారని అనురాగ్ కశ్యప్ మాటలు వింటే తెలుస్తుంది. అనురాగ్ దారిలో మరికొందరు బాలీవుడ్ మేకర్స్, హీరోలు బయట పడతారేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS