దగ్గుబాటి రానా-కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్ర షూటింగ్ ఈరోజు ముగిసింది.
అందుతున్న వివరాల ప్రకారం, ఈ చిత్ర షూటింగ్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా పోస్ట్ చేసింది. ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ట్రైలర్ ని కూడా ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకి తీసుకురాన్నున్నారు.
వచ్చే నెలలో ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదైతేనేమి, చాలా రోజుల గ్యాప్ తరువాత తేజ ఒక సంచలనాత్మక కథతో మనముందుకి రానున్నాడు.