స్వీటీ షెట్టి.. అలియాస్ అనుష్క శట్టిె, హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం. తెరపై ఎంత బోల్డ్‌గా కన్పించినా, ఆఫ్ స్క్రీన్ ఆమె చాలా క్యూట్‌గా, చాలా స్వీట్‌గా కనిపిస్తుంటుంది. ఇప్పటిదాకా ఏ సినిమా ఫంక్షన్‌లోనూ అనుష్క బోల్డ్ లుక్‌లో కన్పించింది లేదు. స్క్రీన్ మీద మాత్రం అనుష్క చెలరేగిపోతుంటుంది హాట్ లుక్‌లో. ఏంటీ తేడా.? ఇది ఆమెకే తెలియాలి. నటన, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పక్కన పెడితే, స్వీటీ మనసు చాలా గొప్పది. అందుకే ఆమెను ఇష్టపడనివారెవరూ వుండరు సినీ పరిశ్రమలో. ‘బాహుబలి’ సినిమాతో అనుష్క పేరు దేశవ్యాప్తగా మార్మోగిపోయింది.
కానీ, అనుష్క నటనలో ఓనమాలు నేర్చుకున్నది మాత్రం తొలి సినిమా ‘సూపర్’తోనే. అందుకే, రాజమౌళి - పూరి జగన్నాథ్.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ రుణపడి వుంటావు.? అని ప్రశ్నిస్తే, ‘పూరి జగన్నాథ్’ అని ఠక్కున సమాధానమిచ్చింది. మామూలుగా అయితే రాజమౌళి పేరుగానీ, ‘అరుంధతి’ సినిమాతో తనను జేజెమ్మగా మార్చిన కోడి రామకృష్ణ పేరుగానీ చెప్పాలి. కానీ, అనుష్క ఎక్కి వచ్చిన మెట్టుని మర్చిపోలేదు. ‘సూపర్’ సినిమా చేయకుంటే, అసలు నేనేంటో ఎవరికీ తెలిసేది కాదంటూ తొలి సినిమాని గుర్తుచేసుకుంది. ఆ సినిమా చేస్తున్న సమయంలో తనకు డాన్స్ రాదనీ, నటన కూడా రాదనీ, అయితే దర్శకుడి దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ తనను ఎంకరేజ్ చేశారనీ, అలా అందరూ తనని ఎంకరేజ్ చేస్తున్న తీరు చూసి తనకు ఏడుపొచ్చేసేదనీ స్వీటీ చెప్పుకొచ్చింది.