దేవసేన దర్శనం ఇలా జరిగిందా.?

మరిన్ని వార్తలు

స్వీటీని ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఎదురు చూడని అభిమానూలు వుండరంటే అతిశయోక్తి కాదేమో. కానీ, అనుష్క అందరికీ అన్ని వేళలా కనిపించదు. దేవసేన కదా.. కాదు, కాదు.. దేవకన్యనే. అయితే, నాని నిర్మాణంలో రూపొందుతోన్న ‘హిట్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అనుష్క సడెన్‌గా దర్శనమిచ్చి, ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. స్కై బ్లూ కలర్‌ చుడీదార్‌లో నిండుగా అందంగా కనిపించింది. అనుష్కని అలా కళ్లారా చూసుకుని ఫ్యాన్స్‌ ఉప్పొంగిపోతున్నారు. అనుష్క తాజా మూవీ ‘నిశ్శబ్ధం’ త్వరలో రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో మాధవన్‌ హీరోగా నటిస్తున్నారు. తెలుగమ్మాయ్‌ అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా, అనుష్క ‘సాక్షి’ అను మ్యూట్‌ ఆర్టిస్ట్‌ పాత్రలో కనిపించనుంది. సస్పెన్స్‌ థ్ల్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉంటే, లాంగ్‌ గ్యాప్‌ తర్వాత అనుష్కనిలా చూస్తుంటే, టాలీవుడ్‌లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. హీరోయిన్స్‌ కొరతతో దొరికిన ఆ కొద్ది మంది హీరోయిన్స్‌తోనే సరిపెట్టుకుంటున్న స్టార్‌ హీరోలు ఇకపై అనుష్కతో కొత్త జోడీ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతెందుకు అప్పుడే తమ అభిమాన సీనియర్‌ హీరోల సరసన హీరోయిన్‌గా అనుష్కని ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఏప్రిల్‌ 2న అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ రిలీజ్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS