ఆది పురుష్... దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించే చర్చ. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తుండడం, పాన్ ఇండియా సినిమా కావడం, దాదాపు 400 కోట్ల బడ్జెట్ కేటాయిండం.. ఇలా ఏ రకంగా చూసినా `ఆది పురుష్` టాక్ ఆఫ్ ది కంట్రీనే. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మరింత ప్రచారం లభిస్తోంది. ఈ సినిమాలో సీతగా అనుష్కని ఎంచుకున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కీర్తి సురేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నా - సీతగా కనిపించే అవకాశాలు స్వీటీకే ఎక్కువ ఉన్నాయంటూ చెప్పుకున్నారు. ఈ వార్తలపై ఎట్టకేలకు అనుష్క స్పందించింది.
''ఆదిపురుష్ లో నేను నటించడం లేదు. అలాంటి అవకాశం ఏదీ నా వరకూ రాలేదు'' అని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ సినిమా కోసం తననెవరూ సంప్రదించలేదని తేల్చి చెప్పేసింది. సో.. సీత పాత్రలో స్వీటీ నటించడం లేదన్నమాట. దాంతో సీత బెర్తు ఖాళీగానే ఉందన్నమాట. 2021 ప్రధమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. సినిమా మొదలవ్వడానికి కాస్త టైమ్ ఉంది కాబట్టి, ఈలోగా సీత పాత్రని ఎంచుకోవడం పెద్ద కష్టమేం కాదు. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.