'మెగా' ఛాన్స్‌ జేజమ్మకే ఉందా.?

మరిన్ని వార్తలు

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ రెట్టించిన ఉత్సాహంతో మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలో వచ్చిన రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ బంపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. మూడు సినిమాలు ఆన్‌ ది వేలో ఉన్నాయి. కొరటాల శివ సినిమా ఆల్రెడీ స్టార్ట్‌ చేసేశారు. ఇక ఇప్పుడు అందరి దృష్టీ చిరు సరసన నటించబోయే అందమైన భామలపైనే ఉంది. చిరుతో జత కట్టే ఆ గోల్డెన్‌ ఛాన్స్‌ ఏ గోల్డెన్‌ బ్యూటీని వరిస్తుందో కానీ, 150 వ సినిమాలో ఆ ఛాన్స్‌ కాజల్‌ అగర్వాల్‌కి దక్కింది.

 

'సైరా'తో తమన్నా కోరిక నెరవేరిపోయింది. ఇక ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. అయితే, వారందరిలోనూ ఫస్ట్‌ ప్లేస్‌ జేజమ్మ అనుష్కకే ఉందనిపిస్తోంది. గతంలో అనుష్క చిరంజీవితో కలిసి స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. తాజాగా 'సైరా'లోనూ స్పెషల్‌ అప్పియరెన్స్‌ మాత్రమే ఇచ్చింది. ఇక మిగిలింది పూర్తి స్థాయి హీరోయిన్‌గా చిరంజీవితో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయడమే. అందుకు కూడా టైం వచ్చేసిందనిపిస్తోంది. 'భాగమతి' తర్వాత అనుష్క కనిపించింది 'సైరా'లోనే. ఎంత క్యూట్‌గా ఉందో జేజమ్మ అంటూ ఆమె ఫ్యాన్స్‌ ముచ్చటపడిపోయారు.

 

కనిపించింది చాలా తక్కువ సమయమే అయినా, ఆ ఇంపాక్ట్‌ అలా కళ్ల ముందు నిలబడిపోయేలా చేసింది ఆమె రూపం. అది ఆమె పర్సనాలిటీ స్పెషల్‌. 'సైజ్‌ జీరో' కోసం పెరిగిన బరువును తగ్గించుకోవడంలో అనుష్క ఎంత కష్టపడినా, ఆ బరువు నుండి విముక్తి కాలేకపోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ, 'సైరా'లో ఆమె లుక్‌ ఆ భ్రమ పోయేలా చేసింది. ఇక త్వరలో 'నిశ్శబ్ధం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్కకి నెక్స్‌ట్‌ ఛాన్స్‌ మెగాస్టార్‌తోనే అంటున్నారు. ఒకవేళ ఆ ఛాన్స్‌ జేజమ్మని వరిస్తే, ఇటు మెగా ఫ్యాన్స్‌కీ, అటు జేజమ్మ ఫ్యాన్స్‌కీ కూడా పండగే పండగ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS