నభా ఈజ్‌ 'సో బెటర్‌' దేన్‌ నిధి!

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా కోసం పోటా పోటీగా అందాల ఆరబోసేయడానికి ఇద్దరు భామలు పోటీపడిన సంగతి తెలిసిందే. అందాల ఆరబోతలో పాపం పాపలు పడిన కష్టానికి ఫలితం బాగానే దక్కింది. సినిమా హిట్టయ్యింది. ఆరేసిన అందాలకు విలువొచ్చింది. అయితే, అసలు విలువ, ఆ తదుపరి అవకాశాలేం వచ్చాయా.? అన్నదానిపైనే ఉంటుందని సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

పేర్లు చెప్పకపోయినా, ఈ అందాల భామల ఎవరనేది మీకు పరిచయమే కదా.! అయినా ఒక్కసారి పేర్లు ప్రస్థావించేసుకుందాం. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌. ఇక వీరిద్దరి అందాల పోటీలో విన్నర్‌ ఎవరనే విషయం పైన చెప్పుకున్నాం కదా.. ఆ కౌంట్‌ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ కౌంట్‌ విషయానికి వస్తే, ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌ నభా నటేష్‌కే దక్కుతుంది. 'ఇస్మార్ట్‌ శంకర్‌' తర్వాత నిధి అగర్వాల్‌ రెండు సినిమాల్లో నటిస్తోంది. కానీ, తెలుగులో ఒక్క అవకాశమూ దక్కించుకోలేకపోయింది. కానీ, నభా నటేష్‌ తెలుగులో బిజీ అయిపోయింది. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయని చెప్పాలి. 'డిస్కోరాజా' సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది.

 

క్రిస్‌మస్‌కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లేటెస్ట్‌గా నభా మెగా కాంపౌండ్‌నీ టచ్‌ చేసేసింది. సాయి ధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా 'సోలో లైఫే సో బెటర్‌'లో నభా హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. ఆల్రెడీ 'ఇస్మార్ట్‌ శంకర్‌' రూపంలో ఓ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. టాలెంట్‌ పరంగా సో బెటర్‌. పూరీ పుణ్యమా అని ఎక్స్‌పోజింగ్‌కి 'ఇలియానా 2.0' అనే ట్యాగ్‌లైన్‌ ఎలాగూ ఉంది. ఇంకేముంది. ఇవి చాలవూ హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి. సో ఫ్యూచర్‌లో నభాకి తిరుగే లేదనిపిస్తోంది చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS