జేజమ్మ కమిట్‌మెంట్‌కి జోహార్లు!

By Inkmantra - September 25, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

జేజమ్మ అనుష్క ప్రస్తుతం 'నిశ్శబ్ధం' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకోసం జేజమ్మ బధిర పాఠశాలకు వెళ్లి అక్కడి పిల్లల ఎక్స్‌ప్రెషన్స్‌ తెలుసుకునే ప్రయత్నం చేసిందట. అంతేకాదు, పెయింటింగ్‌లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుందట. ఈ సినిమాలో పెయింటర్‌గా అనుష్క నటిస్తోంది. ఏదో సినిమా కోసం అన్నట్లుగా కాకుండా, రియల్‌ పెయింటర్‌ అనే ఫీల్‌ కోసం ఆమె రియల్‌గానే పెయింటింగ్‌ నేర్చుకుందట.

 

నేర్చుకోవడమే కాదు, సినిమాలో ఓ సీన్‌ కోసం అనుష్క రియల్‌గానే ఓ బొమ్మ డ్రా చేసిందట. ఆ డ్రాయింగ్‌ సినిమాకి హైలెట్‌ కానుందట. గతంలోనూ సినిమా కోసం అనుష్క చాలా నేర్చుకుంది. ఆ కమిట్మెంట్‌కే అనుష్కని అభిమానించేవారు చాలా ఎక్కువ. ఇకపోతే ఈ సినిమా షూటింగ్‌ అధిక భాగం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకుంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

 

అనుష్క పాత్ర సినిమాకి హైలైట్‌ కానుంది. హేమంత్‌ మధుకరన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంజలి, షాలినీ పాండే తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన అనుష్క పాత్ర 'సాక్షి'కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ రిలీజైతే, సినిమాపై ఓ అవగాహనకు రావొచ్చు. త్వరలోనే ఆ ఏర్పాటుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS