చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకు ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 1న యు.ఎస్‌లో పెద్ద ఎత్తున ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అత్యధిక ధియేటర్స్‌లో 'సైరా' విడుదల కానుంది అక్కడ. ఈ నేపథ్యంలో ప్రీమియర్స్ కోసం ఓ భారీ ఆఫర్‌ని అనౌన్స్ చేసింది చిత్ర బృందం. 'సైరా' టికెట్లు ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్ ప్రకటించింది.
త్వరలోనే బుకింగ్స్ స్టార్ట్ అవ్వనున్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుకింగ్స్ కోసం ఎన్నారైలు పోటెత్తారు. స్నో ఫ్లేక్ సినిమా, వీకెండ్ సినిమా, యూఎస్ బిగ్ థింక్ సంస్థలు అమెరికాలో విడుదల చేస్తున్నాయి. ఇక అక్కడ అనౌన్స్ చేసిన తాజా ఆఫర్‌తో ఎన్నారైలు ఎంజాయ్ చేస్తున్నారు. భారీ అంచనాలున్నాయి యుఎస్‌లో 'సైరా' సినిమాపై. ఇకపోతే, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది 'సైరా'. అన్ని భాషల్లోనూ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. కన్నడ, తమిళ భాషలకు సంబంధించి అక్కడి స్టార్ హీరోలు సుదీప్, విజయ్ సేతుపతిలు తమదైన శైలిలో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇక హిందీకి బిగ్‌బీ పెద్ద పిల్లర్‌లా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ తదితరులు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతూ, చిరంజీవి అటెంప్ట్‌ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు.