సౌత్‌లోని టాప్ లిస్ట్ స్టార్ హీరోయిన్స్‌లో అనుష్క పేరు ముందు వరుసలో ఉంటుంది. హీరోకు ధీటుగా, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించి, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ముద్దుగుమ్మ అనుష్క. అయితే, ప్రస్తుతం అనుష్క చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేవు. ఆమె నటించిన ‘నిశ్శబ్ధం’ సినిమా త్వరలో రిలీజ్ కానుండగా, కరోనా కారణంగా ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ డేట్ సందిగ్ధంలో పడింది. ఈ సంగతి అటుంచితే, మెగాస్టార్ చిరంజీవి - కొరటాల మూవీ ‘ఆచార్య’లో హీరోయిన్గా అనుష్క పేరు వినిపిస్తోంది. ముందుగా ఫిక్స్ చేసిన త్రిష, ఈ సినిమాకి మధ్యలో హ్యాండివ్వడంతో, ఆ ప్లేస్ ప్రస్తుతానికి ఖాళీగా ఉంది.
కాజల్ పేరు వినిపించినా, అనుష్క అయితే బావుంటుందని భావిస్తున్నారట. అయితే, ఇక్కడే అసలు చిక్కొచ్చి పడిరది. కాజల్‌తో కానిచ్చేస్తే పెద్దగా ప్రాబ్లెమ్ లేదు కానీ, అనుష్కని తీసుకుంటే, ఆమె స్టార్‌డమ్‌కి తగ్గట్లుగా ఆ పాత్రలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందనే చర్చ తెరపైకొచ్చింది. ఈ కారణంగా చిరుతో అనుష్క జోడీ బహు బాగు అనుకున్నా, కథ, కథనాల్లో వచ్చే మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని, చిత్ర యూనిట్ అనుష్క పేరును హోల్డ్‌లో ఉంచుతున్నారట. ప్రస్తుతానికైతే, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. చూడాలి మరి, తర్వాత ఏం జరుగుతుందో. చిరు పక్కన స్వీటీనా.? చందమామనా.? ఫైనల్‌గా ఫిక్సయ్యేది ఎవరో.?