అనుష్కతో ‘రుద్రమదేవి’ సినిమా తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్, ‘శాకుంతలం’ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో సమంత అక్కినేని నటించబోతోంది. ఆమె కంటే ముందు పలు పేర్లను గుణశేఖర్ పరిశీలించాడట. ఓ దశలో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ, చివరికి సమంత పేరునే ఖరారు చేసి గాసిప్స్‌కి చెక్ పెట్టారు గుణశేఖర్. ఇదిలా వుంటే, గుణశేఖర తన లక్కీ హీరోయిన్ అనుష్కని కూడా ‘శాకుంతలం’ సినిమా కోసం ఎంపిక చేసే అవకాశం వుందట.
సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అనుష్కని గుణశేఖర్ ఇప్పటికే సంప్రదించాడట కూడా. గుణశేఖర్ అడిగితే, అనుష్క కాదనే పరిస్థితి వుండదు. అనుష్క అనగానే అందరికీ ‘పవర్’ గుర్తుకొస్తుంది.. ఆమెకున్న ఫాలోయింగ్ పవర్ అలాంటిది. అయితే, ‘శాకుంతలం’ సినిమాలో అనుష్క పాత్ర చాలా లవ్‌లీగా వుండబోతోందట. అదేంటన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. కాగా, ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి వాయిస్ నెరేట్ చేసేలా గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నారన్నది మరో ఆసక్తికరమైన గాసిప్. గుణశేఖర్ ప్రాజెక్టుల్ని కాస్త గ్యాప్‌తో చేపడతాడు.. కానీ, వాటి రేంజ్ నెక్స్‌ట్ లెవెల్‌లో వుంటాయన్నది నిర్వివాదాంశం.