ఎంతటి వారికైనా లైఫ్‌లో కష్టాలూ, సుఖాలూ కామనే. అలాగే పైకి నవ్వుతూ కనిపించే మన స్వీటీ అనుష్క లైఫ్‌లోనూ ఓ డార్క్ ఇన్సిడెంట్ ఉందట. సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమయ్యే ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కి ఈ వారం స్వీటీ గెస్ట్‌గా విచ్చేసింది. క్యాష్ హిస్టరీలో ఇంతకు ముందెన్నడూ లేనంత హంగామా స్వీటీ ఎంట్రీకి రెడీ చేశారు ప్రోగ్రాం నిర్వాహకులు. ముందుగా కరోనాపై అవగాహన కల్పించేలా శానిటైజర్‌తో హ్యాండ్స్ శుభ్రం చేసుకోవడం, హగ్గింగ్స్‌కి గుడ్ బై చెప్పేసి, సంస్కారంగా నమస్కారంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత కూడా స్వీటీ సెన్సాఫ్ హ్యూమర్‌తో ప్రోగ్రాం రేంజ్ నెక్స్‌ట్ లెవల్‌కి చేరింది. ఇక మధ్యలో ఒకానొక సందర్భంలో స్వీటీ కంటతడి పెడుతూ కనిపించింది. స్వీటీని చూసి, సుమక్క కూడా ఏడ్చేసింది. సెట్‌లో అంతా సెంటిమెంట్ ఛాయలు..
ఇంతకీ స్వీటీని అంతగా కలిచివేసిన ఆ సెంటిమెంట్ సీన్ ఏంటీ.? స్వీటీ రియల్ లైఫ్‌లో ఆ డార్క్ సీక్రెట్ ఏంటీ.? అనే విషయంపై ప్రోమో చూసిన ఆడియన్స్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అదేంటో తెలియాలంటే ఈ వీక్ క్యాష్ ప్రోగ్రామ్ వీక్షించాల్సిందే. మరో వైపు స్వీటీ లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘నిశ్శబ్ధం’ ఏప్రిల్‌లో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా కారణంగా ప్రస్తుతం ఈ రిలీజ్ డైలమాలో పడింది.