'బాహుబలి' వంటి బిగ్ ప్రాజెక్ట్‌తో అందరి మెప్పు పొందిన అనుష్క, మరోసారీ మ్యాజిక్ చేయబోతోందనిపిస్తోంది. స్వీటీ బ్యూటీ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం 'భాగమతి'. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్స్ ఇప్పటికే సినిమాపై బోలెడన్ని అంచనాలు పెంచేశాయి.
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరో లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ లుక్‌లో అనుష్క చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్లో కత్తి పట్టి, వీరనారిలా కనిపిస్తోంది. అంటే ఈ సినిమా కోసం కూడా అనుష్క కత్తి పట్టిందనిపిస్తోంది. సుత్తి పట్టుకుని తన చేతిని తానే గోడకి కొట్టేసుకుంటున్నట్లుగా కనిపించిన టీజర్ ప్రేక్షకుల్లో ఆశక్తి పెంచింది. తాజా పోస్టర్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్ని తెరకెక్కించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ టీజర్లోనే డిఫరెంట్‌గా ఆకట్టుకుంది.
ఇక సినిమాలో ఏ రేంజ్లో ఉండనుందో. ఇకపోతే, బ్యాక్ గ్రౌండ్ కలర్ దగ్గర నుండీ, కాన్సెప్ట్స్ డిజైన్ అంతా చాలా కొత్తగా అనిపిస్తోంది. పోస్టర్స్ హంగామా చూస్తుంటే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమాలాగే అనిపిస్తోంది. 'బాహుబలి' చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది. 'సైజ్ జీరో' కోసం అనుష్క చాలా బరువెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అనుష్క తన బరువు తగ్గించుకుని ఇదివరకటి తన నాజూకు శరీరాన్ని పొందగలిగింది. 'అరుంధతి' నుండీ క్యారెక్టర్స్ ఎంపికలో అనుష్క చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తోంది. అలా తన కొత్త ఆలోచనలకు మరో కొత్త ప్రతిరూపమే 'భాగమతి' సినిమా.