స్వీటీ గురించి స్వీట్‌ అప్‌డేట్‌ మీకోసం.?

మరిన్ని వార్తలు

స్వీటీ, జేజమ్మ, భాగమతి.. ఇలా అనుష్కకి అభిమానులు పిలుచుకునే ముద్దుపేర్లెన్నో. అయితే మన స్వీటీ బ్యూటీ ప్రస్తుతం ఏం చేస్తున్నట్లు.? అంటే తాజా సమాచారమ్‌ ప్రకారం స్వీటీ త్వరలో అమెరికాకు వెళ్లనుందని తెలుస్తోంది. 

ఏంటీ బరువు తగ్గడానికేమైనానా? అనుకునేరు. కానే కాదు, తన కొత్త సినిమా 'సైలెన్స్‌' (వర్కింగ్‌ టైటిల్‌) కోసం. మాధవన్‌ హీరోగా మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారట. రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీ కానే కాదట ఈ 'సైలెన్స్‌'. అవును రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీస్‌కి మన జేజమ్మ ఎప్పుడో టాటా, బైబై చెప్పేసింది కదా. అందుకే ఆమె నుండి 'సైజ్‌ జీరో', 'భాగమతి' వంటి అద్భుతాలు వచ్చాయి. 

ఇకపోతే ఈ సినిమాని టెక్నికల్‌గా చాలా రిచ్‌గా తెరకెక్కించబోతున్నారట. ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్‌ చేయనున్నారట. అందుకే స్వీటీ అమెరికాకు లగేజ్‌ సిద్ధం చేసుకుంటోందట. ఇక అనుష్క ఫిట్‌నెస్‌ సంగతేంటంటారా? ఆల్రెడీ ఫిట్‌నెస్‌కి సంబంధించి యోగా టీచర్‌ కదా, సహజంగా అనుష్క చేయాల్సినదంతా చేసేసింది. దాంతో పాటు వైద్యుల సలహా మేరకు విదేశాల్లో ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుందట. అయితే ఇప్పుడు స్వీటీ ఎలా ఉందనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్సే. త్వరలోనే తెలిసిపోతుందిలెండి. 

తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది నుండి షూటింగ్‌ ప్రారంభం కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS