15 ఏళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్న అనుష్క తాజాగా ‘నిశ్శబ్ధం’ సినిమాలో నటిస్తోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. ఇకపోతే, ప్రయోగాలకు పెట్టింది పేరైన అనుష్క ఈ సినిమాలోనూ ప్రయోగాత్మక పాత్రలోనే కనిపిస్తోంది. మూగ, చెవిటి అమ్మాయిగా అనుష్క కనిపిస్తోంది. లేటెస్ట్గా అరేంజ్ చేసిన ‘15 ఇయర్స్ జర్నీ ఆఫ్ అనుష్క’ ప్రోగ్రామ్‌లో అనుష్క మాట్లాడుతూ, ‘ఇంతవరకూ మీరు నాపై చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. ఇకపై కూడా మరెన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మీ మెప్పు పొందాలని ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలి..’ అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మాట్లాడిరది.
అనుష్క మాటలను బట్టి, ఇప్పట్లో అనుష్కకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యాల్లేవనుకుంటా.. అంటూ నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా అనుష్క పెళ్లి విషయంలో పలు రకాల గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. కానీ, ఆ విషయం ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా అనుష్క మాటలు వింటుంటే, అనుష్కకి అస్సలు పెళ్లి ధ్యాసే లేదని అర్ధమవుతోంది. కెరీర్లో ఇంకా చాలా ఎత్తులు , లోతులు చూడానుకుంటోంది కాబోలు. అయినా, అనుష్క ఏ నిర్ణయం తీసుకున్నా ఆహ్వానించాల్సిందే. నటిగా ఆమె డెడికేషన్, కమిట్మెంట్ అలాంటివి. కీప్ ఇట్ అప్ స్వీటీ.