ఎందుకో అనుష్క కెరీర్ బాగా మందగించింది. బాహుబలి తరవాత వేగంగా సినిమాలు చేయడం లేదు. భాగమతి హిట్టయినా... తనకు జోష్ రాలేదు. నిశ్శబ్దం తరవాత.. అనుష్క కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. అయితే యూవీ క్రియేషన్స్ లో అనుష్క ఓ సినిమా చేయనుందని ప్రచారం జరిగింది. నవీన్ పొలిశెట్టి, అనుష్క ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని టాక్. వీరిద్దరి పేరు కలిసొచ్చేలా `మిస్ శెట్టి... మిస్టర్ పొలిశెట్టి` అనే టైటిల్ ఖరారు చేశారని కూడా చెప్పుకున్నారు.
అయితే ఈ కథ ఎప్పుడో రెడీ అయినా, అనుష్క నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. అందుకే ఆమె కోసం చిత్రబృందం మొత్తం ఎదురుచూస్తోంది. నవీన్ పొలిశెట్టి కూడా `జాతి రత్నాలు` తరవాత మరో ప్రాజెక్టుపై సంతకం చేయలేదు. ఇప్పుడు అనుష్క కోసం మరి కొంతకాలం ఎదురుచూడాలా? లేదంటే.. అనుష్క ప్లేసులో మరో కథానాయికని ఎంచుకోవాలా? అనే సందిగ్థంలో చిత్రబృందం పడిందని సమాచారం. కథ ప్రకారం అనుష్క అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఇప్పటి వరకూ వెయిటింగ్ లో ఉన్నారు. ఈనెలాఖరు వరకూ అనుష్క కోసం చూస్తామని, లేని పక్షంలో.. మరో కథానాయికని ఎంచుకుంటామని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అనుష్క ఏమంటుందో?