స్వీటీ అనుష్క, అక్కినేని బుల్లోడు నాగచైతన్య జత కడుతున్నారా.? అంటే, నిజమే అనాల్సి వస్తుంది. అయితే, జంటగా కాదు. కలిసి నటించబోతున్నారని చెప్పాలి. అది కూడా బిగ్ స్క్రీన్‌పై కాదు, డిజిటల్ స్క్రీన్‌పై. అవునండీ, మీరు విన్నది నిజమే. ఇప్పటికే చాలా మంది స్టార్ సెలబ్రిటీలూ, అవకాశాల్లేక విలవిల్లాడుతున్న మరికొందరు సెబ్రిటీలూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ని అంకరించేశారు. అంకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ సమంత ‘ఫ్యామిలీ మేన్ 2’తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాజల్, తమన్నా కూడా ఇతరత్రా డిజిటల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. వీరే కాదు చాలా మంది స్టార్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి చూపుతున్నారు.
ఈ తరుణంలో ఇప్పుడు స్వీటీ అనుష్క కూడా ఆ లిస్టులోకి చేరనుందట. ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కుమార్ త్వరలో ఓ వెబ్ సిరీస్ రూపొందించనున్నారు. ఆ వెబ్ సిరీస్‌లో అనుష్క నటిస్తోంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగచైతన్య ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడట. వీరితో పాటు, అమలా పాల్ కూడా ఓ పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. ఇప్పటికే అమలాపాల్ ‘లస్ట్ స్టోరీస్’లోని ఓ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ తాజా వెబ్ సిరీస్ సెట్స్ మీదికెళ్లనుందట. అంతేకాదు, ఈ ఏడాదిలోనే ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, స్వీటీ నటించిన ‘నిశ్శబ్ధం’ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు.