భర్తతో కలిసి బిగ్‌బాస్‌ బ్యూటీ బీచ్‌లో బికినీ షో..!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి, హౌస్‌లో ఉన్నది కొన్ని రోజులే అయినా, తన ఆటిట్యూడ్‌తో గ్లామర్‌తో సెన్సేషనల్‌ క్రియేట్‌ చేసింది ముద్దుగుమ్మ పూజా రామచంద్రన్‌. ‘స్వామిరారా’ తదితర చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో ఫిట్‌నెస్‌ షోస్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది. అయితే, తాజాగా భర్తతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బికినీ షో ఇప్పుడు నెట్టింటిని షేక్‌ చేస్తోంది. ‘తాజాభర్త’తో కలిసి పూజా రామచంద్రన్‌ చేసిన బికినీ షోకు పవర్‌ఫుల్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘తాజాభర్త’ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, 2010లో క్రెయిగ్‌ గెలియాట్‌తో పూజాకు వివాహమైంది.

ఆ రిలేషన్‌షిప్‌ని బ్రేకప్‌ చేసుకుని, బిగ్‌బాస్‌ షోలోకి వెళ్లే ముందే ఆమె మరో వ్యక్తిని వివాహమాడింది. ఆయన పేరు జాన్‌ కొక్కెన్‌. సినీ నటుడే, రీసెంట్‌గా ‘వెంకీమామ’లో విలన్‌గా కనిపించాడీయన. ప్రస్తుతం మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నట్లు జాన్‌కీ పూజాతో జరిగింది రెండో వివాహమే. గతంలో హీరోయిన్‌ మీరా వాసుదేవన్‌తో పెళ్లి జరిగింది. ఆమెతో బ్రేకప్‌ అయ్యాకా, పూజాని పెళ్లి చేసుకున్నాడు. ఫిట్‌నెస్‌లో జాన్‌ కూడా పూజాకి సరిజోడీనే. ఎప్పుడూ ఫిట్‌ బాడీతో మిస్టర్‌ ఫిట్‌నెస్‌ అంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తాజాగా బీచ్‌లో పూజాతో కలిసి ఇదిగో ఇలా ఫోటోకి పోజిచ్చాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అండ్‌ హాట్‌ హాట్‌ పూజా రామచంద్రన్‌ బికినీ లుక్స్‌ కెవ్వుకేకలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS