చిత్రసీమలోకి అడగు పెట్టి పదిహేనేళ్లు కావొస్తున్నా - అనుష్క ఇమేజ్, క్రేజ్ ఏమంత తగ్గలేదు. పైగా.. సినిమా సినిమాకీ పెరుగుతోంది. ఒకట్రెండు ఫ్లాపులొచ్చినా, అనుష్క పారితోషికం తగ్గించుకున్నది లేదు. నిర్మాతలు కూడా అనుష్కనే కావాలనుకుంటుంటే, రేటు ఎక్కడ తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుంది? అనుష్క పారితోషికం ఇప్పుడు 3 కోట్లకుపైమాటే. అయితే అనుష్క కావాలనుకుంటే, కేవలం అనుష్కకే పారితోషికం ఇస్తే సరిపోదు. అనుష్క సిబ్బందికీ ఇవ్వాలి. సాధారణంగా ప్రతి కథానాయికకీ ఇద్దరు ముగ్గురు సిబ్బంది ఉంటారు.
సినిమా జరుగుతున్నన్ని రోజులూ వాళ్ల జీతభత్యాలు సదరు నిర్మాత చెల్లించాలి. కానీ అనుష్క సిబ్బంది మాత్రం ఏడు నుంచి ఎనిమిది మంది ఉంటారు. సినిమా పూర్తయ్యేలోగా వాళ్ల జీతాలు, ఇతరత్రా ఖర్చులు కలిసి దాదాపు 75 లక్షలు అవుతాయట. ఇటీవల `నిశ్శబ్దం` అనే సినిమా పూర్తి చేసింది స్వీటీ. అనుష్క పారితోషికం 3 కోట్లయితే, సిబ్బంది జీతభత్యాలు 75 లక్షల వరకూ అయ్యాయట.
అనుష్క ఈమధ్య బాగా లావుగా కనిపిస్తోంది. డీఐలో లావుని తగ్గించి స్లిమ్ గా చూపించే ఛాన్సు ఉంది. అలా చేయడానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చువుతందని టాక్. ఇవన్నీ నిర్మాతలే భరించాలి. ఇవన్నీ బేరీజు వేస్తే.. అనుష్క కోసం దాదాపుగా 5 కోట్లు పెట్టుబడి పెట్టాల్సివస్తుంది. అసలు కంటే కొసరే.. ఎక్కువ కదా?