మహేష్ బాబు కోసం పూరి జగన్నాథ్ రాసుకున్న కథ `జనగణమన`. పూరితో ఈ సినిమా చేస్తున్నానని మహేష్, మహేష్ కోసమే ఈ కథ రాశానని పూరి అప్పట్లో చెప్పుకున్నారు. ఏమైందో ఏమో.. ఆ సినిమా ఆగిపోయింది. ఆ తరవాత పూరికీ, మహేష్‌కీ అనుకోని గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది. జగనణమన సినిమాని త్వరలోనే తీస్తున్నానని అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించాడు. మహేష్ కోసం రాసుకున్న ఈ కథలో ఏ బాలీవుడ్ స్టార్ కనిపిస్తాడా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
అయితే అప్పటి కథకీ, ఇప్పటి కథకీ చాలా తేడా ఉందట. ఓ రకంగా చెప్పాలంటే.. కథ మొత్తం మార్చేశాడని టాక్. అప్పటి జనగణమనకీ, ఇప్పటి జనగణమనకీ ఏమాత్రం పోలిక లేదని, ఈసారి పూరి కొత్త స్టైల్‌లో కథ రాసుకున్నాడని తెలుస్తోంది. ఇది మిలటరీ నేపథ్యంలో సాగే కథ అని, హీరో జవాన్ గా కనిపిస్తాడని ఓ ప్రచారం నడుస్తోంది. లంచం, అవినితీ.. అనే పాయింట్‌పై భారతీయుడులాంటి కథ అని మరికొందరు అంటున్నారు. నిజమేంటో తెలియాలంటే.. జగనణమన స్టార్ అవ్వాల్సిందే.