2019లో అనుష్క అస్సలు కనిపించలేదు. `సైరా`లో అతిథి పాత్రలో మెరిసిందంతే. `నిశ్శబ్దం` చిత్రాన్ని 2019లోనే విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఆసినిమా రాలేదు. జనవరి 31కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి. జనవరి 31న కూడా ఈ సినిమా రావడం లేదు. ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి హడావుడీ లేకుండా పోయింది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయాలన్నది ప్లాన్. అలాంటప్పుడు ఓ డేట్ ఫిక్స్ చేసి, దాని ప్రకారం విడుదల చేయాలి. తరచూ విడుదల తేదీ మారుతూ ఉంటే గందరగోళం ఏర్పడుతుంది. అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయడం కూడా కష్టసాధ్యమయ్యే విషయం. అందుకే రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడుతుందని సమాచారం.
ఈ విషయంలో అనుష్క కూడా అసహనంతో ఉందట. ఎంతో కష్టపడి చేసిన సినిమా, పైగా చాలా గ్యాప్ తరవాత విడుదల అవుతున్న సినిమా.. అలాంటప్పుడు విడుదల తేదీలో తేడా వస్తే.. సినిమా ఫలితమే మారిపోతుంది. ఇప్పటికైనా చిత్రబృందం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదేమో..?