మరోసారి స్వీటీ యాక్షన్‌ ట్రీట్‌.!

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాలో స్వీటీ అనుష్క యాక్షన్‌ ట్రీట్‌ చూశాం. ఆ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడింది. విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అలాగే 'రుద్రమదేవి' కోసం కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకుంది.

 

ఇప్పుడు మోడ్రన్‌ యాక్షన్‌లో శిక్షణ తీసుకుంటోందట. ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారా.? అనుష్క తాజాగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రాన్ని ఇటీవలే ఓకే చేసింది. ఈ సినిమా ఓ రకంగా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ. హీరోయిన్‌పై చాలా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయట. అందుకే ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం స్వీటీ సిద్ధమైపోతోందట. ప్రస్తుతం అనుష్క బహుభాషా చిత్రం 'సైలెన్స్‌'లో నటిస్తోంది. తెలుగులో 'నిశ్శబ్ధం' టైటిల్‌తో ఈ సినిమా విడుదలవుతోంది.

 

ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని, విడుదల కోసం ఎదురు చూస్తోంది అనుష్క. జనవరి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అనుష్క సాక్షి అనే మ్యూట్‌ ఆర్టిస్ట్‌ పాత్రలో కనిపించనుది. మాధవన్‌ హీరోగా నటిస్తుండగా, హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కోన ఫిలిమ్స్‌ బ్యానర్‌లో కోన వెంకట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ బేస్‌లో రూపొందింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS