బహుశా అనుష్క పై వచ్చినన్నీ గాసిప్స్ మరో హీరోయిన్ పై రాలేదేమో. స్వీటీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ ఆమె చుట్టూ ఎన్నెన్నో గాసిప్స్ చుట్టూముట్టాయి. ఐతే ఇలాంటి గాసిప్స్ ను కేర్ చేయకుండా కెరీర్ లో దూసుకుపోయి.. ఎవరికీ అందనంతా క్రేజు ను సొంతం చేసుకొని వెండితెర యువరాణి 'దేవసేన 'గా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను పదిలంగా నిలుపుకుంది స్వీటీ.
ప్రస్తుతం బాహుబలి2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుష్క పై ఇప్పుడు మరో గాసిప్ తెరపైకి వచ్చేసింది. అనుష్క తన పర్శనల్ స్టాఫ్ మొత్తంను మార్చేసిందని ఈ గాసిప్ సారాంశం. దీనిపై ఎవరికి నచ్చిన కధనాలు వారు ఇచ్చుకుంటున్నారు. అనుష్క పర్శనల్ లైఫ్ కు ఇబ్బంది కలిగించేలా స్టాఫ్ ప్రవర్తన ఉండటంతో కోపగించుకున్న స్వీటీ స్టాఫ్ ను తొలగించిదని ఓ టాక్ వినిపిస్తుంటే.. ఒక విషయంలో స్టాఫ్ పై పెట్టుకున్న నమ్మకం ను వమ్ము చేసినందుకు స్వీటీ అలా చేయాల్సివచ్చిందని ఇంకో మాట వినిపిస్తుంది. వాస్తవానికి అనుష్క స్టాఫ్ ను సొంత మనుషుల్లా చూసుకుంటుందనే పేరుంది. చాలా దయ గుణం స్వీటీది. అలాంటిది ఏకంగా మొత్తం స్టాఫ్ నే తొలగించేసిందంటే దీని వెనుక ఎదో బలమైన కారణమే ఉంటుందనుకోవాలి.