అనుష్క పక్కా ప్రొఫెషనల్. సెట్లోనూ, బయటా ఎంతలో ఉండాలంటే అంతలో ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువ క్లోజ్ అవ్వదు. ఎప్పుడూ మాట జారదు. అయితే... `నిశ్శబ్దం` సెట్లో ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందట. ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో అనుష్క అంత సంతృప్తిగా లేదని తెలుస్తోంది. ఈ చిత్ర రచయిత, నిర్మాత కోన వెంకట్‌పై అనుష్క సీరియస్‌గా ఉందని టాక్. ఈ సినిమాకి కోన నిర్మాత. కానీ దర్శకత్వం విషయంలోనూ విపరీతంగా కలగజేసుకోవడం అనుష్కకి నచ్చడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. అయితే.. హేమంత్‌కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా సెట్లో అంతా తానై వ్యవహరిస్తున్నాడట కోన వెంకట్.
సెట్లో హేమంత్ ఒకటి చెబుతాడని, ఆ వెంటనే కోన వచ్చి మరోలా సీన్‌ని వివరిస్తున్నాడని.. ఈ విషయంలో అనుష్క బాగా అప్ సెట్ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం అనుష్క - కోన మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయట. మొత్తానికి నిశ్శబ్దం వెనుక చాలా విషయాలే జరుగుతున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.