అబ్బా.. ఈ మధ్య సీక్వెల్స్ గోల చాలా ఎక్కువైపోయింది. వాస్తవానికి చెప్పాలంటే, తొలి పార్ట్‌లు సక్సెస్ అయినంత సులువుగా, సీక్వెల్స్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. కానీ, సీక్వెల్స్‌పై మనోళ్ల మోజు తీరడం లేదు. ఇకపోతే, తాజా సీక్వెల్ వివరాల్లోకి వెళితే, నాని నటిస్తున్న ‘వి’ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోందట.. అనే టాక్ తెరపైకి వచ్చింది. అన్నీ బాగుంటే, ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా దేశంలో.. కాదు, కాదు ప్రపంచ పరిస్థితులెలా ఉన్నాయో తెలిసిందే కదా.. సో ఈ సినిమా రిలీజ్ సంగతి అలా వెనక్కి వెళ్లిపోయింది.
ఇక ఇప్పుడు తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్‌ని సీక్వెల్ రూపొందించేలా వదిలిపెట్టారని మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు.?’ అనేలా అన్నమాట. బాహుబలిని ఎందుకు చంపాడన్న సస్పెన్స్ మొదటి పార్ట్‌లో వదిలి పెట్టేసి, రెండో పార్ట్‌లో కన్‌క్లూజన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ‘వి’కి కూడా ఆసక్తికరమైన క్లైమాక్స్ రూపొందించారట. అలా ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతోందనే టాక్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే, సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అందుకు ఎంత టైమ్ వెయిట్ చేయాలన్నది మాత్రం అడగొద్దు ప్లీజ్. బాబోయ్ కరోనా.