బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ సినిమాలతో ఎప్పుడూ బిజీగా గడుపుతుంటుంది. అలా అని మిగిలిన విషయాలనేం పక్కన పెట్టేయదండోయ్. అందుకే ఏకంగా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని లవ్వాడి, పెళ్లాడింది. లవ్‌లోని అన్ని మూమెంట్స్నీ ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్లో ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా, పర్సనల్ లైఫ్‌ని కూడా భీభత్సంగా ఎంజాయ్ చేసే అనుష్కా శర్మ అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా హాట్ హాట్ ఫోటో సెషన్స్‌లోనూ పాల్గొంటూ ఉంటుంది. అందులో భాగంగానే అమ్మడు దిగిన ఈ పిక్‌పై ఓ లుక్కేస్కోండి. సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది కదా. పచ్చ పచ్చని ఆకులు, ఎర్రని ముద్దమందారాలు కాదులెండి అలాంటి నిండైన ఎరుపు రంగు పూల మధ్యన అనుష్కా శర్మ కనీ కనిపించని అందాలు కెవ్వు కేక పుట్టిస్తున్నాయ్. ఇటీవలే 'సూయీ దాగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్కా శర్మ, త్వరలో 'జీరో' సినిమాతో సందడి చేయనుంది. షారూఖ్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.