బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోన్న అనుష్కా శర్మ, తాజాగా బీచ్‌లో దర్శనమిచ్చింది. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ టూ పీస్ బికినీలో ఎంజాయింగ్ మూడ్‌లో కనిపించింది. కళ్లకు స్టైలిష్ గాగుల్స్ ధరించి, స్వీట్ స్మైల్ ఇస్తూ, ఫోటోకి పోజిచ్చింది. టైట్ హెయిర్ స్టైల్‌తో, చెవులకు సింపుల్ డ్రాపింగ్ ఛైన్స్ వేలాడుతున్నాయి. మోకాలిపై కూర్చుంది ఆహ్లాదంగా స్మైల్ ఇస్తూ, ఇచ్చిన ఈ సైడ్ యాంగిల్ పోజుకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. అందాలారబోతలో హాట్నెస్ ఏముంటుంది. ఇదిగో ఈ స్మైల్లోనే నిఖార్సయిన హాట్నెస్ దాగుంది.. అన్నట్లుగా కాన్ఫిడెంట్‌గా నవ్వేస్తోంది అనుష్కా శర్మ.
హీరోయిన్గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అనుష్కా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకుని కోహ్లీ భార్యగా, సరికొత్త స్టార్డమ్ దక్కించుకుంది. నటిగానే కాకుండా, నిర్మాతగానూ అభిరుచి గల చిత్రాలను రూపొందిస్తోంది. గతేడాది వచ్చిన 'జీరో' సినిమా తర్వాత అనుష్క మరో సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం లేదు. 'జీరో'లో రెండు కాళ్లూ పని చేయని యువతిలా వీల్ ఛైర్లో కూర్చొని బోలెడన్ని ఎమోషన్స్ పండించిన అనుష్కా శర్మ ప్రస్తుతం ఏం చేస్తుంది.? అంటే ఇదిగో ఇలా పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.. అంటూ ఈ తాజా పిక్స్ నిరూపిస్తున్నాయి.