రౌడీతో జాన్వీ ఫిక్సయినట్లేనా?

మరిన్ని వార్తలు

అతిలోక సుందరిగా శ్రీదేవికి టాలీవుడ్‌లో మంచి పేరుంది. ఆరాధ్య దేవతలా ఆమెను ఆరాధిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ. ఆమె వారసురాలైన జాన్వీకపూర్‌ తెలుగు నాట అడుగుపెట్టడం కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. జాన్వీ కపూర్‌ని ఎలాగైనా తెలుగులోకి తీసుకురావాలని మన దర్శక, నిర్మాతలు కూడా ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. నిజానికి బాలీవుడ్‌లోనూ ఒకే ఒక్క సినిమాలో నటించింది ఇంతవరకూ జాన్వీ కపూర్‌. కానీ, ప్రస్తుతం ఆమె చేతిలో బడా ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.

 

ఈ తరుణంలో ఆమె టాలీవుడ్‌లో అడుగు పెట్టడం కాస్త కష్టమే కానీ, మన దర్శక, నిర్మాతలు జాన్వీ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం త్వరలోనే జాన్వీ ఎంట్రీకి తెలుగు నాట రంగం సిద్ధమైందని అంటున్నారు. రౌడీ స్టార్‌గా సంచలనం సాధించిన విజయ్‌ దేవరకొండ - జాన్వీ కపూర్‌ జోడీపై ఎప్పటి నుండో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవే గుసగుసలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి.

 

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, పూరీ దర్శకత్వంలో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ కూడా షురూ కానుందని తెలుస్తోంది. ఎంతోమంది ముద్దుగుమ్మల్ని పరిచయం చేసిన ఘనత పూరీ జగన్నాధ్‌కి ఉంది. ఆ క్రమంలో పూరీ కంపెనీ నుండే అతిలోక సుందరి వారసురాలి తెరంగేట్రం జరగబోతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS