విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్కా శర్మపై గత కొంతకాలంగా గర్భవతి అంటూ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయమై స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీడియాకి ఆమె కాస్త ఘాటుగా చురకలు అంటించారు. హీరోయిన్‌ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే చాలు, పెళ్లి కాని వాళ్లయితే, మీరు ఎవరితో డేటింగ్‌లో ఉన్నారు.? పెళ్లయినవాళ్లయితే, మీరు గర్భవతా.? అనే ప్రశ్నల్ని చాలా తేలిగ్గా అడిగేస్తున్నారు. అడిగేవాళ్లకి ఈ ప్రశ్నలు సరదాగా అనిపించొచ్చునేమో.. కానీ, చెప్పేవాళ్లకు, వినేవాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి.
మీడియాలో ఈ తీరు మారాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇలాంటి చీప్ గాసిప్స్‌కి తానెందుకు స్పందించాలి..? అంటూ కస్సుమన్నారు. ఈ మధ్య అనుష్క వదులుగా ఉండే దుస్తులు వేసి, కెమెరా కంటపడుతోంది. అంతే, ఆ నేచర్‌ని ఆసరాగా తీసుకుని, అనుష్క గర్భవతి అట.. అంటూ గాసిప్స్ పుట్టించేశారు. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా, తెగ చక్కర్లు కొట్టేస్తుండడంతో, ఎట్టకేలకు అనుష్క ఆ వార్తల్ని ఖండించింది.
2017లో అనుష్క, విరాట్ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అనుష్క సినిమాల్లో చాలా బిజీగా గడుపుతోంది. కెరీర్ ఇంత స్వింగ్‌లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీతో ఆ స్వింగ్‌కి అడ్డుకట్ట వేయకూడదనే ఉద్దేశ్యంలో అనుష్క ఉందేమో. గతేడాది 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల చర్చల్లో బిజీగా ఉంది.