ఇక్కడా అక్కడా: కాజల్‌ డబుల్‌ ధమాకా!

By iQlikMovies - August 01, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

చందమామ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం తమిళంలో 'కోమాలి' అనే ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాతి యుగం మొదలుకొని నేటి కలియుగం వరకూ మానవ జీవితం ఎలా పురోగతి చెందిందనే కాన్సెప్ట్‌ని దశల వారీగా ఈ చిత్రంలో చూపించబోతున్నారట. జయం రవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్‌, సంయుక్తా హెగ్దే (కిర్రాక్‌ పార్టీ ఫేమ్‌) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

ఈ సినిమా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయం రవి రకరకాల గెటప్స్‌లో కనిపించనున్నాడు ఈ సినిమాలో. అయితే, హీరోయిన్‌గా కాజల్‌ పాత్రకు ఈ సినిమాలో నిడివి చాలా తక్కువట. నిడివి తక్కువయినా, సినిమాలో ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడంతో, నిడివితో సంబంధం లేకుండా వెంటనే ఈ సినిమాని ఒప్పేసుకుందట. కథ కూడా కొత్తగా ఉండడంతో, ఇలాంటి సినిమాలో తానూ ఓ భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని కాజల్‌ చెబుతోంది.

 

మరోవైపు కాజల్‌ త్వరలో 'రణరంగం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలోనూ కాజల్‌ డిఫరెంట్‌ రోల్‌ ప్లే చేస్తున్నట్లే. శర్వానంద్‌ డబుల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాలో యంగ్‌ హీరోయిన్‌ కళ్యాణీ ప్రియదర్శిని నటిస్తుండగా, మరో పాత్రలో కాజల్‌ నటిస్తోంది. అంటే, ఈ రెండు సినిమాల్లోనూ కాజల్‌కి జూనియర్‌ హీరోయిన్లు గట్టి పోటీ ఇస్తున్నారన్న మాట. అన్నట్లు ఈ రెండు సినిమాలూ ఆగస్ట్‌ 15న విడుదలవుతుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS