చూసి తట్టుకోలేక తిట్టేసిన అనుష్క శర్మ

By iQlikMovies - June 18, 2018 - 15:45 PM IST

మరిన్ని వార్తలు

అనుష్క శర్మ- హిందీ పరిశ్రమలో నటిగా అడుగుపెట్టి పది సంవత్సరాలు కూడా అవ్వకముందే తనకంటూ తానే ఒక బ్రాండ్ సృష్టించి బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈమధ్యనే భారత జట్టు క్రికెట్ టీం కెప్టెన్ అయిన విరాట్ కోహ్లిని పెండ్లాడింది.

అయితే ఆమెకి ముక్కు సూటి గా మాట్లాడే తత్వం ఉన్న విషయం అందరికి తెలిసిందే/ దానితో ఆమెకి రోడ్డుపైన సమస్య ఏదైనా అ ఎక్కువేనని అందరికి తెలుసు.ఇందుకు తాజా ఉదాహరణగా నిన్న తన కారులో ఆమె ప్రయాణం చేస్తుండగా పక్కనే వెళుతున్న కారు నుండి ఒక వ్యక్తి ప్లాస్టిక్ ని రోడ్డు పైన పడేశాడు.

వెంటనే తన కారుని ఆపి సదరు వ్యక్తిని రోడ్డుపైన ప్లాస్టిక్ ఎందుకు వేస్తున్నావు అని ప్రశ్నిస్తుండగా ఆమె భర్త అయిన కోహ్లి ఆ వీడియో తీసి తన ట్విట్టర్ లో పెట్టడం తో ఇప్పుడు అది ఒక సెన్సేషన్ గా మారిపోయింది. 

ఇంకొంతమంది మాత్రం వీరిరువురు వీడియో కోసమే ప్లాస్టిక్ అంటూ హడావిడి చేశారు అన్న వారు కూడా లేకపోలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS