అనుష్క ట్రీట్‌మెంట్ విక‌టించిందా?

మరిన్ని వార్తలు

బ‌రువు త‌గ్గ‌డానికి అనేక మార్గాలున్నాయి. వాటిలో చాలామంది కృతిమ విధానాల‌నే అవ‌లంభిస్తున్నారు. స‌హ‌జ మార్గాల ద్వారా బ‌రువు త‌గ్గితే మేలు. కాక‌పోతే... అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. త్వ‌రిత‌గ‌తిన బ‌రువు త‌గ్గాలంటే కృత్రిమ మార్గాల్ని అన్వేషించాల్సిందే. మ‌న సినీ తార‌లు చేసేది అదే. అయితే కొన్నికొన్నిసార్లు ఆ ప్ర‌య‌త్నాలు బెడ‌సి కొడుతుంటాయి. అనుష్క విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది.

 

సైజ్ జీరో స‌మ‌యంలో అనుష్క బ‌రువు విప‌రీతంగా పెరిగిపోయింది. బాహుబ‌లిలో కూడా త‌ను లావుగానే కనిపించింది. భాగ‌మ‌తి సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌టి నుంచీ.. అనుష్క మ‌రీ ఇంత లావుగా త‌యారైందేంటి? అనే కామెంట్లు వినిపిస్తూ వ‌చ్చాయి. వాటిని అనుష్క కూడా సీరియ‌స్‌గానే తీసుకొంది. బ‌రువు త‌గ్గాల‌న్న ధ్యేయంతో...కొన్నాళ్లు సినిమాలు కూడా ఒప్పుకోలేదు. ఆస్ట్రేలియా వెళ్లి.. అక్క‌డ‌ బ‌రువు త‌గ్గ‌డానికి కృత్రిమ విధానాలు పాటించింద‌ని, అయితే ఆ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని టాక్‌. అందుకే ఇప్పుడు స‌హ‌జ ప‌ద్ధ‌తుల ద్వారా బ‌రువు త‌గ్గాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉందని తెలుస్తోంది. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌ధారిగా యూవీ క్రియేష‌న్స్ ఓ సినిమా రూపొందిస్తోంది. న‌వీన్ పొలిశెట్టి హీరో. ఈ సినిమా షూటింగ్ లో అనుష్క పాల్గొవాలి. కానీ.. మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం అడిగింద‌ట‌. ఈ రెండు నెలల్లో బ‌రువు త‌గ్గి సెట్స్‌పైకి వ‌స్తాన‌ని చెప్పింద‌ట‌. దాంతో.. ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. అంటే. త్వ‌ర‌లోనే స‌రికొత్త స్వీటీని చూస్తామ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS