అనుష్క పెళ్లి విషయంలో... వచ్చిన రూమర్లు మరే కథానాయిక విషయంలోనూ వచ్చి ఉండవు. ప్రభాస్ తో అనుష్క పెళ్లి దాదాపు ఖాయమనే రాసేశారంతా. కానీ.... `ఇద్దరూ స్నేహితులం మాత్రమే` అని ఆ ఇద్దరూ బల్లగుద్ది చెప్పడంతో పెళ్లి వార్తలకు చెక్ పడింది. ఆ తరవాత కూడా స్వీటీ పెళ్లి కబుర్లు వినిపిస్తూనే వచ్చాయి. అవేం... నిజాలు కావన్న సంగతి అందరికీ అర్థమైపోయింది.
అయితే ఇప్పడు మరోసారి అనుష్క పెళ్లి వార్త వైరల్ అవుతోంది. అనుష్కకి పెళ్లి సంబంధం కుదిరిపోయిందని, దుబాయ్ కి చెందిన ఓ వ్యాపార వేత్తతో అనుష్క పెళ్లి జరగబోతోందన్నది ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్న కారణంగా... పెళ్లి ఆస్యలం అవుతోందని, పరిస్థితులు చక్కబడిన తరవాత... ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని సమాచారం. పెళ్లి విషయాన్ని త్వరలోనే అనుష్క మీడియా ముఖంగా చెప్పబోతోందట. ఇది పెద్దలు కుదర్చిన పెళ్లే అని, పెళ్లయ్యాక... అనుష్క సినిమాలకు దూరం అవుతుందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా ఈ వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలి.