మహానటితో ఓ సూపర్ హిట్టు కొట్టాడు నాగ అశ్విన్. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా దక్కింది. అంతకంటే ముఖ్యంగా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రభాస్ - నాగ అశ్విన్ సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఈ కాంబినేషన్ ఎలా సెట్టయ్యిందా? అనుకున్నారు. వాళ్లు అనుకున్నట్టే... సినిమా ఓకే అయినా.. సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం తీసుకుంటోంది.
నాగ అశ్విన్ సినిమా తరవాత ఒప్పుకున్న సినిమాల్ని ప్రభాస్ పట్టాలెక్కిస్తున్నాడు గానీ, ఈసినిమాని పట్టించుకోవడం లేదు. దాంతో ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే అనుమానాలు మొదలైపోయాయి. అయితే ఇప్పుడు ఈసినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చింది. ప్రభాస్‌తో సినిమాని ఈ దీపావళికి అధికారికంగా ప్రారంభిస్తార్ట. 2022 మొత్తం.. ప్రభాస్ ఈ సినిమాకే కేటాయిస్తాడని తెలుస్తోంది. 2023లో నాగ అశ్విన్ సినిమా విడుదల అవుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
దీపికా పదుకొణె కథానాయిక. వీళ్ల కాల్షీట్లు కూడా 2022లోనే ఉన్నాయట. సో.. ఈ సినిమా 2022లో మొదలై.. 2023లో విడుదల కావడం ఖాయమన్నమాట. త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తుందని, విడుదల తేదీ కూడా ఫిక్స్ చేసేస్తుందని సమాచారం.